చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand), మాస్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) కాంబినేషన్‌లో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ (Bhogi) విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను (Censor Formalities) పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మొదట ఆగస్టు 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం, 1960ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీగా వీఎఫ్ఎక్స్ (Visual Effects – VFX) పనులు చేయాల్సి రావడంతో వాయిదా పడింది. అనంతరం నవంబర్ 12న విడుదలకు సిద్ధమైనప్పటికీ, అనివార్య కారణాలతో మరోసారి వాయిదా పడింది. తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్(A Certificate)జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
సెన్సార్ పూర్తవడంతో నవంబర్ 27న ‘భోగి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 1960ల నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శర్వానంద్ ‘గంగా’(Ganga) అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో ఆయన నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ని (K.K. Radhamohan)ర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి నవంబర్ 27 విడుదల తేదీపై అధికారిక స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.








