పోలీస్ స్టేషన్‌లో డ్యూటీ.. ఫామ్‌హౌస్‌లో పార్టీ.. వీడియో వైరల్!

పోలీస్ స్టేషన్‌లో డ్యూటీ.. ఫామ్‌హౌస్‌లో పార్టీ.. వీడియో వైరల్!

Summarize with AI

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల (Bellampalli One Town Police) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్ (Police Station) రికార్డుల్లో ఆన్ డ్యూటీలో ఉన్నట్లు నమోదై ఉండగానే, కొందరు పోలీసులు విధులకు దూరంగా ఫామ్‌హౌస్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో (Birthday Celebrations)పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వేడుకల్లో మద్యం (Alcohol) మత్తులో పోలీసులు చిందులు వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీస్ విధుల్లో(Police Duty) ఉండాల్సిన సమయంలో ఫామ్‌హౌస్‌లో (Farmhouse) బర్త్‌డే పార్టీలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో ఉండాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడంపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆన్ డ్యూటీలో ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసి వేడుకల్లో పాల్గొన్నారన్న ఆరోపణలు నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల స్పందన, తదుపరి చర్యలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment