‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మరియు దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’ (Varanasi) సినిమా ఇప్పటికే ఫ్యాన్స్‌లో ఉహించలేని క్రేజ్ సృష్టిస్తోంది. కేఎల్ నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. పూర్తి IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించిన ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు, విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. పారిస్‌లో టీజర్ ప్రదర్శన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే గుర్తింపు పొందిన ‘వారణాసి’ కు అభిమానుల ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది.

తాజాగా, ఈ విజువల్ వండర్ ఏప్రిల్ 9, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల (Grand Release) చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని థియేటర్ రిలీజ్ కోసం ఎంచుకోవడం ద్వారా లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌ను కూడా అందించాలనేదే రాజమౌళి మాస్టర్ ప్లాన్. ఈ డేట్ అనౌన్స్‌మెంట్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉత్సాహానికి చివరి లేదు. ఏప్రిల్ 2027లో ‘వారణాసి’ థియేటర్స్‌లోకి అడుగు పెట్టిన వెంటనే, వసూళ్లలో సునామీ సృష్టించబోతోంది అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment