తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వరుస ఘటనపై కేంద్ర హోం శాఖ సమీక్షకు సంబంధించిన అంశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైకుంఠ దర్శనం టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో నేడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలంటూ హోం శాఖ ఆదేశాలిచ్చింది. ఏపీ ప్రభుత్వం హోమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయడంతో ఆ లేఖను తక్షణమే విరమించాలంటూ తన శాఖ ఉన్నతాధికారులను అమిత్ షా ఆదేశించినట్లు సమాచారం.

తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు హోం అఫైర్స్ కంట్రోల్ రూం ఆఫీసర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. హోంమంత్రి ఆదేశాలతో టీటీడీ అధికారులతో హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దు అయినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ జోక్యంతో టీటీడీ అధికారులతో సమీక్షా ఆదేశాలను కేంద్ర హోం శాఖ వెనక్కి తీసుకున్నట్లుగా సమాచారం.




