రూ.2,000 కోట్ల బడ్జెట్.. ‘ది ఒడిస్సీ’కి ఇండియాలో అదిరిపోయే ఓపెనింగ్!

రూ.2,000 కోట్ల బడ్జెట్.. ‘ది ఒడిస్సీ’కి ఇండియాలో అదిరిపోయే ఓపెనింగ్!

Summarize with AI

హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంటోంది. హోమర్ గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఫాంటసీ మూవీ సుమారు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,000 కోట్లకు పైగా) బడ్జెట్‌తో తెరకెక్కింది. విడుదలకు ముందే భారతదేశంలోని ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో ఐమ్యాక్స్ షోలు హౌస్‌ఫుల్ కావడం నోలన్‌పై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా తొలి రోజే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ది ఒడిస్సీ’ భారత్‌లో తొలి రోజే రూ.23 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. మాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్, అన్నీ హాత్వే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్, లుపిటా న్యోంగో వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ సినీ చరిత్రలో పూర్తిస్థాయిలో ఐమ్యాక్స్ కెమెరాలతో తెరకెక్కిన తొలి ఫీచర్ ఫిల్మ్‌గా కూడా ఈ సినిమా గుర్తింపు పొందింది. తొలి రోజు నుంచే భారీ స్పందన రావడంతో వీకెండ్‌లో మరింత భారీ వసూళ్లు సాధించి, భారత బాక్సాఫీస్ వద్ద మరో హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment