టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం

టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం

Summarize with AI

పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్‌ ప్రసారం చేసే సంస్థగా ప్రసిద్ధి పొందిన తర్వాత, ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను ప్రారంభిస్తున్నట్లు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం, శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, టీసాట్ ఛానల్‌లో వ్యవసాయంపై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు హార్టికల్చర్ (ఉద్దానవన విధానం) అంశాలపై కూడా ప్రత్యేక ప్ర‌సారం చేయ‌నున్నారు.

వ్యవసాయానికి సంబంధించి అనుభవం కలిగిన శాస్త్రవేత్తలు, అధికారులు, మరియు ఆద‌ర్శ రైతులు తమ విలువైన సలహాలు, అనుభవాలను పంచుకుంటారు. ఇది రైతులకు ఆధునిక టెక్నాలజీ, పద్ధతులను తెలుసుకునేందుకు సహాయపడుతుంది.

వ్యవసాయ రంగం అభివృద్ధికి ఇది కీలకం
ఈ కొత్త కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలను అందించడం లక్ష్యంగా ఉందని సీఈవో పేర్కొన్నారు. ఇది రైతులకు తమ పంటల ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుందని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment