అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారతదేశం (India), ప్రధాని నరేంద్ర మోడీపై (Narendra Modi) ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో (Delhi) అమెరికా స్వాతంత్ర్య (American Independence) 250వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన “ఫ్రీడమ్ ఎట్ 250” (Freedom at 250) వేడుకల్లో రాయబారి సెర్గియా గోర్‌కు (Sergio Gor) ఫోన్ చేసిన ట్రంప్, అక్కడ ఉన్న అతిథులను ఉద్దేశించి భారత్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. “నాకు భారత్ (India) అంటే చాలా ఇష్టం.. అమెరికా-భారత్ (America-India) సంబంధాలు మరింత బలపడాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో సంబంధిత వీడియోను షేర్ చేయడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు(Trade Agreements), సుంకాలు(Tariffs), మార్కెట్ యాక్సెస్ (Market Access) వంటి కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం పొందుతున్నాయి. గతంలో కొన్ని అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కనిపించినప్పటికీ, ఇప్పుడు సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంపై ట్రంప్ చేసిన ప్రశంసలు కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. దీంతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తుపై మరోసారి దృష్టి కేంద్రీకృతమైంది.








