రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా!

రేవంత్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా!

Summarize with AI

హైదరాబాద్‌లోని (Hyderabad) సరూర్‌నగర్ స్టేడియంలో (Saroornagar Stadium) నిర్వహించిన బీఆర్ఎస్(BRS) యువజన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన యూత్ డిక్లరేషన్ (Youth Declaration హామీలను (Promises) అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 30 నెలలు గడిచినా నిరుద్యోగ యువతకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని, ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు (Private Jobs Reservations), మహిళలకు స్కూటీలు (Women Scooters), భారీ ఉద్యోగ నియామకాలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యువతను నమ్మించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్(KTR) బహిరంగ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) నిజంగానే 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆధారాలతో నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఉద్యోగాల కోసం వారు ఎదురుచూస్తున్నారని అన్నారు. యువశక్తి (Youth Power) ఒక్కసారి ఉద్యమిస్తే అధికార పీఠాలు కదిలిపోతాయని హెచ్చరించిన కేటీఆర్.. సీఎం అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పాలనకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment