The Paradise Review: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ.. జ‌డ‌ల్ హిట్ కొట్టాడా..?

ది ప్యారడైజ్ మూవీ రివ్యూ.. జ‌డ‌ల్ హిట్ కొట్టాడా..?

Summarize with AI

నటీనటులు: నాని, మోహన్‌ బాబు, రాఘవ్‌ జుయల్‌, కయాదు లోహర్‌, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్‌ బాబు, ప్రియదర్శి, సత్యరాజ్, తనికెళ్ల భరణి తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్‌ ఓదెల
నిర్మాత: చెరుకూరి సుధాకర్‌
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
సినిమాటోగ్రఫీ: సిహెచ్ సాయి
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

ఒకప్పుడు పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో క్లాస్ ఎంటర్‌టైనర్లు అందించిన నాని, ‘దసరా’తో పూర్తిగా మాస్ అవతారం ఎత్తారు. అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి నాని చేసిన రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’. అనౌన్స్‌మెంట్ నుంచే కాకుండా పాటలు, గ్లింప్స్‌తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం ఈరోజే (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసిందో లేదో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఈ కథ 1947 నుంచి మొదలై 1980ల నాటి నేపథ్యంలో సాగుతుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సరిహద్దులోని ‘ప్యారడైజ్’ ప్రాంతం మాత్రం సంపన్న వర్గానికి చెందిన శికంజ మాలిక్ (మోహన్ బాబు) గుప్పిట్లోనే ఉంటుంది. అక్కడ నివసించే సవారీ జాతి ప్రజలకు ఎలాంటి గుర్తింపు, ఓటు హక్కు ఉండవు. తమ ఉనికి కోసం ఆ జాతికి చెందిన సమ్మక్క (సోనాలి కులకర్ణి) నిరంతరం పోరాడుతుంటుంది.

ఆమె కొడుకే జడల్ (నాని). చిన్నతనంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల జైలుకు వెళ్లిన జడల్, 14 ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు. శికంజ మాలిక్‌పై పగ తీర్చుకోవడమే అతడి ప్రధాన లక్ష్యం. అయితే, శికంజ మాలిక్ కొడుకు (రాఘవ్ జుయల్) వల్ల ప్యారడైజ్‌లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? జైలు నుంచి వచ్చిన జడల్ తన తల్లి పోరాటాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు? సవారీ జాతి ప్రజల గుర్తింపు కోసం ఏకంగా ఎలాంటి విప్లవాత్మక అడుగులు వేశాడు? ఈ కథలో సుబ్బు (కయాదు లోహర్), బిర్యానీ (సంపూర్ణేష్ బాబు) పాత్రల ప్రాధాన్యత ఏంటి అనేదే మిగతా సినిమా.

ఎలా ఉందంటే?
తమ ఉనికి, హక్కుల కోసం అణచివేతకు గురైన ఒక జాతి చేసిన పోరాట నేపథ్యంతో తెరకెక్కిన రెవల్యూషనరీ యాక్షన్ డ్రామా ఇది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కథనాన్ని మొత్తం 6 చాప్టర్లుగా విభజించి నడిపించారు. మొదటి భాగంలో సవారీ జాతి నేపథ్యం, వారి బాధలు, హీరోయిన్ ఎంట్రీ, మదర్ సెంటిమెంట్‌ను ఆసక్తికరంగానే చూపించారు. రా అండ్ రస్టిక్ విజువల్స్, నాని ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాంగ్ ద్వితీయార్థంపై ఉత్కంఠను పెంచుతాయి. అయితే, ఫస్టాఫ్ నుంచే శృతిమించిన వయెలెన్స్, రక్తం ఏరులైపారే సన్నివేశాలు ఎక్కువగా ఉండటం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.

ద్వితీయార్థంలో కథ కొంత గాడి తప్పిన భావన కలుగుతుంది. పాయింట్ బలంగానే ఉన్నా, కథనం సాగదీసినట్లుగా మారి ఎమోషన్ కాస్త వీకైంది. స్వయం ప్రతిపత్తి రాజ్యాన్ని ప్రకటించుకోవడం వంటి కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. అయితే, ఎమ్మెల్యే శంకరన్నగా ప్రియదర్శి కనిపించే ఎపిసోడ్ థియేటర్లలో ఈలలు వేయిస్తుంది. కేసీఆర్‌ మ్యానరిజమ్స్, ప్రెస్ మీట్ డైలాగ్ డెలివరీని పోలి ఉండే ఈ పాత్ర వినోదాన్ని పండించింది. విపరీతమైన యాక్షన్ సీన్స్, సింపుల్ క్లైమాక్స్ ఉన్నప్పటికీ.. మాస్, యాక్షన్ ప్రియులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే?
నాని:
జడల్ పాత్రలో నాని నటన నెక్స్ట్ లెవెల్. తెలంగాణ యాసతో పాటు మాస్, యాక్షన్ సన్నివేశాల్లో జీవించేశారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత వయెలెంట్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు.
మోహన్ బాబు: శికంజ మాలిక్‌గా ఆయన అనుభవం, గాంభీర్యం, డైలాగ్ డెలివరీ సినిమాకు పెద్ద అసెట్. పవర్‌ఫుల్ విలనిజంతో మెప్పించారు.
ప్రియదర్శి: ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో ఆయన నటన, డైలాగ్స్ థియేటర్లలో నవ్వులు పూయించాయి.
ఇతర నటీనటులు: రాఘవ్ జుయల్ విలనిజంలో ఆకట్టుకోగా, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.

సాంకేతికంగా..
ఈ సినిమాకు సాంకేతిక బృందం ప్రధాన బలం. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు (‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’) సినిమా స్థాయిని పెంచాయి. సిహెచ్ సాయి కెమెరా వర్క్ రా, రస్టిక్ వాతావరణాన్ని పర్ఫెక్ట్‌గా ఆవిష్కరించింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ప్యారడైజ్ ప్రపంచాన్ని రీక్రియేట్ చేసిన తీరు అద్భుతం. ఎడిటింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

  • ప్లస్ పాయింట్స్
  • నాని అద్భుత నటన, మాస్ అవతారం
  • మోహన్ బాబు, ప్రియదర్శిల స్క్రీన్ ప్రజెన్స్
  • అనిరుధ్ బీజీఎమ్ & సూపర్ హిట్ సాంగ్స్
  • ప్రొడక్షన్ వాల్యూస్ & ఆర్ట్ వర్క్
  • ఇంటర్వెల్ సీన్ & యాక్షన్ ఎపిసోడ్స్
  • మైనస్ పాయింట్స్
  • కథలో కొత్తదనం లేకపోవడం
  • సెకండాఫ్‌లో సాగదీత, వీకైన ఎమోషన్
  • శృతిమించిన వయెలెన్స్ (రక్తపాతం)
  • లాజిక్‌లేని కొన్ని సన్నివేశాలు

బాట‌మ్ లైన్‌
ఓవరాల్‌గా ‘ది ప్యారడైజ్’ అనేది విపరీతమైన యాక్షన్, రా అండ్ రస్టిక్ డ్రామాను కోరుకునే ప్రేక్షకులను మెప్పించే చిత్రం.

రేటింగ్ : 2.5/5

Join WhatsApp

Join Now

Leave a Comment