సీ.జోస‌ఫ్ విజ‌య్ అనే నేను..

సీ.జోస‌ఫ్ విజ‌య్ అనే నేను..

తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ (Joseph Vijay) (దళపతి విజయ్) తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రిగా (Chief Minister – CM) ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ అట్టహాస వేడుకలో గవర్నర్ (Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ విజ‌యం సాధించ‌డంతో దశాబ్దాల కాలంగా డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీల మధ్యే సాగుతున్న తమిళ రాజకీయాలకు బ్రేక్ పడింది.

కూటమి మద్దతుతో మేజిక్ ఫిగర్..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని TVK 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మెజారిటీ మార్కును అందుకోవడానికి కాంగ్రెస్ (5), విసికే (2), వామపక్షాలు (4), ఐయూఎంఎల్ (2) పార్టీలు మద్దతు ప్రకటించాయి. మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

హాజరైన ప్రముఖులు
ఈ ప్రమాణ స్వీకార వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. అలాగే విజయ్ తల్లిదండ్రులు ఎస్‌.ఏ. చంద్రశేఖర్(S.A. Chandrasekhar), శోభ దంపతులు తమ కుమారుడి పట్టాభిషేకాన్ని చూసి మురిసిపోయారు. ఈ వేడుకలో సినీ నటి త్రిష ప్రత్యేకాకర్షణగా నిలిచారు. విజయ్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించిన ఆమె రాజకీయ ప్రస్థానానికి మద్దతుగా వేడుకలో పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు
విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే తమిళనాడు వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. చెన్నై వీధులన్నీ TVK జెండాలతో, విజయ్ కటౌట్లతో నిండిపోయాయి. బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుతూ అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. నెహ్రూ స్టేడియం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment