నాకు ఇంకా పెళ్లి కాలేదు బాబోయ్.. పెళ్లి రూమర్లపై డింపుల్ హయాతి ఫన్నీ కౌంటర్!

నాకు ఇంకా పెళ్లి కాలేదు బాబోయ్.. పెళ్లి రూమర్లపై డింపుల్ హయాతి ఫన్నీ కౌంటర్!

Summarize with AI

అసలు విషయం ఏంటో తెలియకుండానే సోషల్ మీడియాలో కొందరు ఏదేదో ఊహించేసుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయాతి విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఏకంగా ఆమెకు పెళ్లి కూడా అయిపోయిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడంతో, డింపుల్ తనదైన స్టైల్లో ఫన్నీ కౌంటర్ ఇచ్చి అందరినీ నవ్వించేసింది.

యంగ్ హీరో శర్వానంద్ నటించిన యాక్షన్ మూవీ ‘భోగి’ ఈ నెల 27న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రీసెంట్‌గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి పాల్గొని సందడి చేసింది. స్టేజ్‌పై తన గ్లామర్, ఎనర్జీతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. అయితే, ఈ వేడుకలో స్టేజ్‌పై ఉన్న డింపుల్, పక్కనే ఉన్న శర్వానంద్ వైపు కొద్దిగా వంగి ఏదో సరదాగా మాట్లాడుతున్న ఓ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఓ మీమ్ పేజీ సరదాగా ఈ వీడియోను షేర్ చేయడంతో దాని కింద కామెంట్ల వర్షం మొదలైంది. అందులో ఒక నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. “శర్వానంద్ లాగే డింపుల్ హయాతికి కూడా పెళ్లయిపోయింది కదా” అంటూ ఓ కామెంట్ వదిలాడు. అది చూసిన డింపుల్ ఏమాత్రం సీరియస్ అవ్వకుండా చాలా కూల్‌గా, అంతే సరదాగా రియాక్ట్ అయ్యింది. నాకు ఇంకా పెళ్లి కాలేదంటూ ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి స్టేజ్‌పై కో-స్టార్స్ ఇద్దరూ ఏదో క్యాజువల్‌గా మాట్లాడుకుంటే, దానికి ఏవేవో లింకులు పెట్టేసి ఏకంగా పెళ్లి వార్తల వరకు తీసుకెళ్లారు. కానీ డింపుల్ హయాతి ఇచ్చిన ఒక్క స్వీట్ పంచ్‌తో ఆ గాసిప్స్‌కు అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పడిపోయింది. ఏదేమైనా ఈ వీడియో, దానికి డింపుల్ ఇచ్చిన రిప్లై పుణ్యమా అని ‘భోగి’ సినిమాకు సోషల్ మీడియాలో మంచి ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్టయిందని అంటున్నారు. మరి నవంబర్ 27న రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment