జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు

జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు

Summarize with AI

జాతీయ క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు మెరిశారు. ఈ పోటీల్లో రాష్ట్రానికి రెండు కాంస్య పతకాలు దక్కాయి. నెట్‌బాల్ మిక్డ్స్‌ టీమ్ ఈవెంట్ లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 31-31 స్కోరుతో ‘డ్రా’ కావడంతో రెండుజట్లకు కాంస్య పతకం ప్రకటించారు.

షూటింగ్ మిక్డ్స్‌ స్కీట్ టీమ్ ఈవెంట్ లో మునేక్-రష్మీ రాథోడ్ జోడీ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. చివరి రౌండ్‌ వరకు హోరాహోరీగా సాగిన పోరులో మునిక్‌, రష్మి జోడీ 133 పాయింట్లతో నిలిచింది. హర్యానా, పంజాబ్‌ షూటర్లు వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.

నేషనల్‌ గేమ్స్ చివరి రోజైన శుక్ర‌వారం నాడు తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలతో 26వ స్థానంలో కొనసాగుతున్నది. క్రీడాకారుల విజయం తెలంగాణ రాష్ట్ర క్రీడా రంగానికి గర్వకారణమైంది. మరిన్ని విజయాలతో భారత క్రీడా రంగంలో తెలంగాణ రాణించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment