ఎడమ కంటికి బదులు కుడి కంటికి ఆపరేషన్‌.. సుమోటోగా స్వీకరించిన HRC

ఎడమ కంటికి బదులు కుడి కంటికి ఆపరేషన్‌.. సుమోటోగా స్వీకరించిన HRC

Summarize with AI

సిరిసిల్లకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి శస్త్రచికిత్స చేశారనే వార్తలపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TG HRC) స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్.. ఆరోపణలు నిజమైతే వైద్య నిర్లక్ష్యం, రోగి భద్రత, శస్త్రచికిత్సకు ముందు తీసుకున్న సమ్మతిపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయని పేర్కొంది. ఘటనపై రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి నుంచి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

సెప్టెంబర్‌ 28న కంటి సమస్యతో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లిన వెంకమ్మను వైద్యులు పరీక్షించి ఎడమ కంటికి శస్త్రచికిత్స అవసరమని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆపరేషన్‌ అనంతరం కుడి కంటికి శస్త్రచికిత్స జరిగినట్లు గుర్తించి వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైద్య రికార్డులు, శస్త్రచికిత్స వివరాలు, రోగి కుటుంబ సభ్యుల సమ్మతి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఇప్పటికే జరిగిన విచారణ వివరాలను నివేదికలో పొందుపరచాలని కమిషన్‌ ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment