ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ ముందుగానే తన అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర‌మంత్రి కిషన్‌రెడ్డి అభ్య‌ర్థుల పేర్లను ఖరారు చేశారు.

అభ్యర్థులు వీరే..
నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా అంజిరెడ్డి ఎంపిక చేశారు. అదే విధంగా నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా మల్క కోమరయ్య పేరును ఖ‌రారు చేశారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా సర్వోత్తం రెడ్డిని బీజేపీ అధిష్టానం ఖ‌రారు చేసింది.

ఓటర్ల జాబితా
మార్చితో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేప‌థ్యంలో ఖాళీ అయిన స్థానాల‌కు ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ఇప్పటివరకు 28,000 మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటు హ‌క్కు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 22,554 మంది ఓటర్లతో ముసాయిదా జాబితాను ఖరారు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment