హనుమాన్ చాలీసాతో.. నాల్గో టెస్టులో టీమిండియా దూసుకెళ్తుందా?

హనుమాన్ చాలీసాతో.. నాల్గో టెస్టులో టీమిండియా దూసుకెళ్తుందా?

Summarize with AI

లార్డ్స్‌ (Lords) లో చేజారిన మ్యాచ్ తర్వాత, మాంచెస్టర్‌ (Manchester)లో జ‌ర‌గ‌బోయే నాలుగో టెస్ట్‌ (Fourth Test)కి టీమిండియా రెడీ అవుతోంది. సిరీస్‌ను 2-2తో సమం చేయాలన్న లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగబోతోంది. అయితే మాంచెస్టర్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఒక్క విజయం కూడా లేదు – తొమ్మిది టెస్టుల్లో ఐదు డ్రాలు, నాలుగు ఓటములు మాత్రమే ఉన్నాయి.

ఈసారి పరిస్థితులు మారాలంటే జట్టులో జోష్‌ అవసరం. అందుకే మేనేజ్‌మెంట్ స్పెషల్ మూమెంట్ సృష్టించింది. ప్రాక్టీస్ సెషన్లలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa), ఇంగ్లిష్ పాప్, పంజాబీ పాటలు ప్లే చేస్తూ ఆటగాళ్ల మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేసింది. పంత్, బుమ్రా జిమ్‌లో ఫిట్‌నెస్ మెరుగుపరుస్తుండగా, సిరాజ్‌ (Siraj) వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా, నెట్స్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ (Arshdeep Singh)కు గాయం కావడం ఆందోళన కలిగిస్తోంది. అతని ఆరోగ్య పరిస్థితిని జట్టు నిశితంగా గమనిస్తోంది.

సిరీస్ టర్నింగ్ పాయింట్‌గా మారబోతున్న ఈ టెస్ట్‌లో భారత్ గెలిచి గౌరవంగా సమం చేయగలదా? అన్నది అభిమానుల ప్రశ్నగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment