“టూరిజం డెవలప్‌మెంట్‌కు(Tourism Development) , సోషల్ మీడియా లైక్స్‌కు లింకేంటి సార్?”.. ఇప్పుడు వైజాగ్ పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న ఇది. విశాఖపట్నం ఎంపీ(Visakhapatnam MP), మంత్రి నారా లోకేష్( Nara Lokesh) తోడల్లుడు భరత్ బీచ్ షాక్స్(Beach Shacks), మద్యం (Liquor) విక్రయాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీశాయి. దీనిపై పర్యావరణవేత్తలు, నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తుండగా, జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetti Satyanarayana) ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్‌గా మారింది.
ఎంపీ భరత్ అసలేమన్నారు?
“ఒక సంవత్సరం క్రితం ఒక బీచ్ ఫెస్టివల్‌లో (Beach Festival) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ముందు నేను మాట్లాడాను. ‘మీరందరూ ఈ బీచ్ షాక్స్‌ను సపోర్ట్ చేస్తున్నారు అంటే.. ఈ వీడియోకు రెస్పాండ్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి’ అని అడిగాం. ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఇన్‌స్టా పేజీల్లో వీడియో పెడితే దాదాపు 50 నుంచి 60 లక్షల మంది చూశారు. అందులో 5 నుంచి 10 లక్షల మంది లైక్(Like) చేశారు. అంటే ప్రజలకు ఇది కావాలనే కదా” అని భరత్ వ్యాఖ్యానించారు.
ఎంపీ భరత్ వ్యాఖ్యలపై నెటిజన్లు వినూత్నంగా స్పందిస్తున్నారు. “సోషల్ మీడియాలో రీల్స్‌కు(Reels) లైకులు వస్తే చాలు.. బీచ్‌లలో మద్యం షాపులకు, బార్లకు పర్మిషన్లు ఇచ్చేస్తారా సార్?” అంటూ ప్రశ్నిస్తున్నారు. బహిరంగంగా ప్రజల, పర్యావరణ ప్రేమికుల క్షేత్రస్థాయి అభిప్రాయాలను తెలుసుకోకుండా, కేవలం డిజిటల్ లైక్స్‌ను ప్రామాణికంగా ఎలా తీసుకుంటారని నెటిజన్లు మండిపడుతున్నారు. లైక్స్ వచ్చాయని బీచ్‌లలో మద్యం అమ్ముతారా..? అని ఎంపీ సమాధానానికి అవాక్కవుతున్నారు.
గీతం యూనివర్సిటీలో పెట్టుకోండి
ఎంపీ భరత్ వ్యాఖ్యలపై పర్యావరణవేత్త, జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “బీచ్‌లో కంటే శ్రీభరత్‌కు చెందిన గీతం (GITAM) యూనివర్సిటీలోనే మద్యం షాపులు (Liquor Shops) తెరవాలి” అంటూ బొలిశెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పర్యాటకం పేరుతో, మద్యం షాపులతో విశాఖ బీచ్ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని డిమాండ్ చేశారు. “రేపు పొద్దున సంపద సృష్టి పేరుతో బెల్జియం ఎయిర్‌పోర్ట్ (Belgium Airport) తరహాలోనే ఇక్కడ కూడా వ్యభిచారాన్ని (Prostitution) అధికారికం చేస్తారా?” అంటూ బొలిశెట్టి సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సంచలనం రేపుతోంది.
వైజాగ్(Vizag) అందమైన తీర ప్రాంతాన్ని కాపాడుకోవాలని, గోవా తరహా సంస్కృతిని ఇక్కడ రుద్దడం వల్ల పర్యావరణంతో పాటు స్థానిక శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ లైక్స్ వచ్చాయని లిక్కర్ షాపులు తెరిచే కాన్సెప్టుపై పేలుతున్న సెటైర్లకు టీడీపీ ఎంపీ భరత్ ఏం వివరణ ఇచ్చుకుంటారో మరి.








