మంచి ప్రభుత్వమని కూటమి పార్టీలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తలకు కూటమి పార్టీల నాయకుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో జరిగిన ఘటన ప్రభుత్వ తీరుపై విమర్శలకు తావిస్తోంది. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని రెండో వార్డ్ వెంకట్రావుపల్లి తూర్పు వీధిలో టీడీపీ నాయకులు, కౌన్సిలర్ కలిసి వైసీసీ మద్దతు దారుల ఇళ్లకు వెళ్లే దారికి ఇనుప తీగలతో కంచెను నిర్మించారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఏళ్ల తరబడి అందరూ రాకపోకల సాగించే ప్రభుత్వ స్థలంలో కంచె వేయటం ఏమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. తూర్పు వీధిలో నివసిస్తున్న యనమాల రమణయ్య, కిలారి పుల్లయ్య, పెంచలయ్య కుటుంబాలు వైసీపీకి మద్దతుగా ఉంటారన్న ఆక్రోశంతో ఆ మూడు కుటుంబాల వారు ఉపయోగించే దారి తమదంటూ టీడీపీ కౌన్సిలర్ సహా ఆ పార్టీ నాయకులు దగ్గుపాటి పెంచల రెడ్డి, శివ కోటారెడ్డి, పద్మారెడ్డి, పుల్లారెడ్డి తదితరులు జులుం ప్రదర్శిస్తున్నారని, యనమల రామయ్య కుటుంబంపై దాడికి సైతం పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.
ముగ్గురి ఇళ్లకు అనాదిగా ఉన్న పడమర, ఉత్తర దిశల్లోని రోడ్డును టీడీపీ నాయకులు బ్లాక్ చేసి ఇనుప కంచె నిర్మించారు. ‘ప్రభుత్వం మాది కాబట్టి కంచె వేస్తున్నాం. మీ ప్రభుత్వం వచ్చాక తొలగించుకోండి’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, పోలీసులు సైతం ఈ విషయం చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై కలెక్టర్ వద్దకు వెళ్తనున్నట్లుగా బాధితులు తెలిపారు.
వివాదంపై విజయ్ దేవరకొండ వివరణ