అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి?

అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి?

Summarize with AI

టాలీవుడ్‌ (Tollywood) హీరో, దివంగ‌త అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్ (Sumanth) త్వ‌ర‌లో పెళ్లిపీట‌లు ఎక్క‌నున్నారు. సుమంత్‌ మరోసారి ప్రేమ వివాహం (Love Marriage) చేసుకోనున్నట్లు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రముఖ హీరోయిన్‌తో ఆయన ప్రేమలో ఉన్నారని, ఈ జంట గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉందని సమాచారం. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సుమంత్ పెళ్లి గురించి త్వ‌ర‌లో అక్కినేని కుటుంబం (Akkineni Family) నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కానున్నట్లుగా స‌మాచారం. సుమంత్ 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డి (Keerthi Reddy)ని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్నాళ్ల కాపురం త‌రువాత సుమంత్‌-కీర్తిరెడ్డి జంట 2006లో విడాకులు (Divorce) తీసుకున్నారు. 2006 నుంచి సుమంత్ సింగిల్ స్టేట‌స్‌ను మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన జీవితం మరో కొత్త దశలోకి అడుగుపెడుతున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే అక్కినేని ఇంట పెళ్లిభాజాలు త్వ‌ర‌లో మోగ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment