విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా భీమిలి (Bheemili) లో శుక్రవారం ఉదయం ఓ దారుణమైన హత్య (Brutal Murder) సంచలనం సృష్టించింది. యువతిని దారుణంగా హత్య చేసి ఆపై ఆమె ముఖంపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మారికవలస రాజీవ్ గృహకల్పకు చెందిన మహిళ వెంకట లక్ష్మీ (Venkata Lakshmi) భర్త సూరిబాబు (Suri Babu) నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు (Died). మృతురాలుకు ఇద్దరు పిల్లలు చంద్రమౌళి (డిగ్రీ), కానూరి దామోదర్ (10th క్లాస్) ఉన్నారు. ఒంటరిగా ఉంటున్న వెంకట లక్ష్మీతో దివీస్ (Divis) లో పనిచేసే క్రాంతికుమార్‌కు (Kranti Kumar) పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన చనువు వివాహేతర సంబంధానికి దారి తీసింది. కాగా, గురువారం రాత్రి వెంకటలక్ష్మీని ఇంటి నుంచి బయటకు రప్పించి క్రాంతికుమార్.. ఆ తరువాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడని, ఆపై ఆమెపై పెట్రోల్ (Petrol) పోసి నిప్పు అంటించాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా, ఈ హత్యలో నిందితుడు క్రాంతి కుమార్‌కు ఎవరెవరు సహకరించారన్న అంశంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్