తమిళనాడు ఎన్నికల్లో సెలబ్రిటీ సందడి.. స్టార్‌లంతా ఓటింగ్ లో

తమిళనాడు ఎన్నికల్లో సెలబ్రిటీ సందడి.. స్టార్‌లంతా ఓటింగ్ లో

Summarize with AI

తమిళనాడు (Tamil Nadu) శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోలీవుడ్‌ స్టార్‌ నటుడు అజిత్‌ (Ajith) తన ఓటు హక్కును వినియోగించారు. చెన్నైకి దక్షిణంగా ఉన్న తిరువన్నీయూర్‌ (Thiruvanmiyur) పోలింగ్‌ కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్న ఆయన, మొదటి ఓటర్లలో ఒకరిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల బెల్జియంలో జరిగిన అంతర్జాతీయ కార్ రేసింగ్ పోటీలో విజయం సాధించిన అజిత్‌ ఎన్నికల కోసం ప్రత్యేకంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఓటు వేసిన అనంతరం ప్రతి పౌరుడూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ (Vijay) చెన్నైలోని నీలాంకరై మున్సిపల్‌ స్కూల్‌లో తన ఓటును వేశారు. అలాగే ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌ హాసన్‌ తన కుమార్తె శృతి హాసన్‌, రజనీకాంత్, హీరో సూర్య, జ్యోతిక, ధనుష్, విక్రమ్, శివకార్తికేయన్, నటి త్రిష, అర్జున్ మరియు ఇతర సెలబ్రెటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిల్చొని ఓటు వేసిన అనంతరం ప్రజలంతా తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment