టాలీవుడ్లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి టబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ప్రత్యేక పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో పండు పాత్రలో టబు చేసిన నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పటికీ ఆ పాత్రను ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా గుర్తుచేసుకుంటారు. ఈ నేపథ్యంలో టబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక గ్లింప్స్‌ను పంచుకున్నారు. అందులో ‘నిన్నే పెళ్లాడతా’లోని పండు పాత్రను గుర్తుచేస్తూ, ఆమె సినీ ప్రయాణంలోని మరో ఆసక్తికరమైన కోణాన్ని పరిచయం చేశారు.
అయితే ఈసారి టబు ప్రేమకథలో కనిపించడం లేదు.. వీరనారి అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమెను ‘మహంతి ఝాన్సీ రాణి’గా పరిచయం చేస్తూ, ఈసారి ప్రేమ కాదు.. పోరాటం అంటూ ఆసక్తికరమైన సందేశాన్ని జోడించారు. దీంతో ఈ కొత్త పాత్రపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పండుగా ప్రేక్షకులను అలరించిన టబు.. ఇప్పుడు ఝాన్సీ రాణి పాత్రలో ఎలాంటి నటనతో ఆకట్టుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ ప్రత్యేక గ్లింప్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలుస్తోంది.








