మూడు భారీ ప్రాజెక్టులతో సూర్య

మూడు భారీ ప్రాజెక్టులతో సూర్య

దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న హీరో సూర్య (Suriya), ఇప్పుడు తన కెరీర్‌ను మరోసారి పీక్ స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్త దారిని ఎంచుకున్నారు. ‘జై భీమ్’, ‘సూరరై పోట్రు’ వంటి కథాబలం ఉన్న సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, పక్కా కమర్షియల్ హిట్ మాత్రం కొంతకాలంగా దూరమై ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఈసారి పాన్ సౌత్ స్థాయిలో ప్రణాళికలు వేసి, వరుసగా మూడు భాషల్లో మూడు వేర్వేరు దర్శకులతో కలిసి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

తమిళ్ మార్కెట్‌పై మళ్లీ ఫోకస్ చేస్తూ, మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకునే దర్శకుడు ఆర్జే బాలాజీతో ‘సూర్య 45’ను మొదలుపెట్టారు. ఇదే సమయంలో తన రెండో పెద్ద బేస్ అయిన తెలుగు ప్రేక్షకుల కోసం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సూర్య 46’ (Suriya 46)ను లైన్‌లో పెట్టారు. తెలుగు నేటివిటీని ప్రతిబింబించే కథతో ఈ సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గర కావచ్చని తెలుస్తోంది.

ఇక కేరళలో సూర్యకు ఉన్న భారీ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు, తాజాగా ‘ఆవేశం’ (Aavesham) వంటి హిట్ ఇచ్చిన జిత్తు మాధవన్‌ (Jithu Madhavan)తో ‘సూర్య 47’ (Suriya 47)ను ప్లాన్ చేశారు. మలయాళ సినిమాల్లో కనిపించే వైవిధ్యం, సూర్య నటనతో కలిస్తే కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ వెంబడించకుండా, దక్షిణాది మూడు భాషల నేటివిటీలను నమ్ముకుని ఆయా రాష్ట్రాల దర్శకులతో సినిమాలు చేయడం సూర్య తీసుకున్న తెలివైన నిర్ణయం. ఒకే ఏడాదిలో మూడు వేర్వేరు ఇండస్ట్రీలలో పనిచేస్తూ, సౌత్ బాక్సాఫీస్‌ను మరోసారి షేక్ చేయాలని ఆయన లక్ష్యం. ఈ కొత్త వ్యూహం ఆయనను మళ్లీ నంబర్ వన్ రేసులోకి తీసుకువస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Join WhatsApp

Join Now

Leave a Comment