స్టీఫెన్ స‌న్ భూమి నిషేధిత జాబితాలో చేర్చిన రేవంత్ సర్కార్‌

స్టీఫెన్ స‌న్ భూమి నిషేధిత జాబితాలో చేర్చిన రేవంత్ సర్కార్‌

Summarize with AI

తెలంగాణలో(Telangana) సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు (Cash-For-Vote Case) ఫిర్యాదుదారుడు, నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు(Elvis Stephenson) రేవంత్ స‌ర్కార్ (Revanth Reddy Government) షాక్ ఇచ్చింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC elections) వేళ తనను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన‌ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినందుకే.. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ స్టీఫెన్‌సన్ తెలంగాణ హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించారు.

సికింద్రాబాద్ (Secunderabad) బోయిగూడ ప్రాంతంలో తనకు ఉన్న 1,936 చదరపు గజాల భూమిని రేవంత్ ప్రభుత్వం అక్రమంగా నిషేధిత భూముల జాబితాలో (Prohibited properties list)చేర్చిందని స్టీఫెన్ స‌న్‌ వాపోయారు. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్లలో ఉల్లంఘనలను పరిశీలించేందుకంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 134, దాని ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ కేవలం రాజకీయ ప్రత్యర్థులను, విపక్ష నేతలను వేధించేందుకే ఉపయోగపడుతోందని మండిపడ్డారు.

తన భూమికి సంబంధించి జీవో 134 అమలును తక్షణమే నిలిపివేయాలని, నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఈ విచారణ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను హైకోర్టు సీనియర్ ధర్మాసనం పరిశీలించింది. ఈ వ్యవహారంలో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి తుది విచారణ జరిపేందుకు పిటిషన్‌ను సింగిల్ జడ్జి బెంచ్ ముందర ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది

2015లో నాటి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డికి(Revanth Reddy) వ్యతిరేకంగా ప్రధాన సాక్షిగా, ఫిర్యాదుదారుడిగా ఉన్న స్టీఫెన్‌సన్ ఆస్తిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా చర్యలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని ఉపయోగించి పాత పగలు తీర్చుకునేందుకు భూక్రమబద్ధీకరణ నిబంధనలను అస్త్రంగా మార్చుకున్నారని బీఆర్‌ఎస్ సహా పలు రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment