శ్రీకాళహస్తిలో దారుణం.. వైసీపీ నేత తల్లిదండ్రులపై దాడి, తల్లి మృతి

శ్రీకాళహస్తిలో దారుణం.. వైసీపీ నేత తల్లిదండ్రులపై దాడి, తల్లి మృతి

తిరుప‌తి (Tirupati) జిల్లా శ్రీకాళహస్తి (Srikalahasti)లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. శ్రీ‌కాళ‌హ‌స్తి మండలంలోని పుల్లారెడ్డి కండ్రిగ (Pullareddy Kandriga) గ్రామంలో వైసీపీ(YSRCP) మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి (Chevireddy Madhusudhan Reddy) తల్లిదండ్రులపై (Parents) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

ఈ దాడిలో వైసీపీ నేత‌ తల్లి జయమ్మ (Mother Jayamma) అక్కడికక్కడే మృతి (Died) చెందగా, తండ్రి మహాదేవ రెడ్డి తీవ్ర గాయాలతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి (Srikalahasti Government Area Hospital)లో చికిత్స పొందుతున్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఇంట్లో పనిచేసే పనిమనిషిని కూడా పోలీసులు ప్రశ్నించారు. హత్య వెనుక ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ దాడి వెనుక రాజ‌కీయ ప‌ర‌మైన కార‌ణాలు ఉన్నాయా అని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ఘటనను పరిశీలించిన ఏ‌ఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ, “జయమ్మ హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించాం. అన్ని కోణాల్లో విచారణ సాగుతోంది. నిందితులను త్వరగా గుర్తించి కేసును చేధిస్తాం” అని తెలిపారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment