సంక్షోభంలో విద్యా వ్య‌వ‌స్థ‌.. ప్రధాని క్షమాపణ చెప్పాలి

సంక్షోభంలో విద్యా వ్య‌వ‌స్థ‌.. ప్రధాని క్షమాపణ చెప్పాలి

Summarize with AI

దేశంలోని విద్యా వ్యవస్థ (Education System) పూర్తిగా సంక్షోభంలో (Crisis) కూరుకుపోయిందని లోక్‌సభ (Lok Sabha) ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకులతో (Question Papers Leaks) లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు (Students Future) ప్రమాదంలో పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై (Central Government) తీవ్ర విమర్శలు గుప్పించారు.

గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఇన్ని ఘటనలు జరిగినప్పటికీ ఒక్కరికీ కూడా శిక్ష పడలేదని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు (Students) ఆందోళన వ్యక్తం చేయడం పూర్తిగా సమంజసమేనని అన్నారు.

నీట్ (NEET) పరీక్ష కోసం దేశవ్యాప్తంగా కుటుంబాలు ప్రతి ఏడాది సుమారు రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఇది కేంద్ర ప్రభుత్వం విద్య (Education) కోసం కేటాయిస్తున్న వార్షిక బడ్జెట్‌కు దాదాపు సమానమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. విద్య క్రమంగా ఖరీదైపోతోందని, మరోవైపు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని ఆయన అన్నారు. తయారీ రంగం, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం.. అన్ని విభాగాల్లోనూ ఉపాధి అవకాశాలు (Employment Opportunities) తగ్గాయని విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగాలే (Government Jobs)యువతకు ప్రధాన ఆశగా మారిన సమయంలో, ఆ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల వ్యవస్థ కూడా ప్రశ్నాపత్రాల లీకులతో దెబ్బతింటోందని రాహుల్ గాంధీ అన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను (Dharmendra Pradhan) వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకులు, విద్యార్థులపై తీసుకున్న చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment