ఐపీఎల్(IPL) 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) వరుసగా మూడు విజయాలు సాధించి మంచి ఫామ్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై (Delhi Capitals) 47 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు నమోదు చేసిన సన్‌రైజర్స్, బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో సమతుల్య ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, తమ జట్టు వ్యూహం చాలా సింపుల్ అని, ప్రతి మ్యాచ్‌ను కొత్తగా తీసుకుని ఆడతామని తెలిపాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్, హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) ఫినిషింగ్ తమ విజయానికి కీలకమని ఆయన ప్రశంసించాడు.
ఇషాన్ కిషన్ మాట్లాడుతూ జట్టు ఆలోచనా విధానం గురించి కూడా వివరించాడు. పిచ్‌ను అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే బ్యాటర్లు దూకుడుగా ఆడతారని, అందరూ ఆత్మవిశ్వాసంతో ఆటను ఆస్వాదిస్తారని చెప్పాడు. అలాగే బౌలింగ్ వ్యూహాలపై మాట్లాడుతూ, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా హర్ష్ దూబే వంటి కీలక బౌలర్లను ఉపయోగించడం విజయానికి కారణమైందని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో తాను ఎక్కువగా మాట్లాడకుండా ఆటగాళ్లను స్వేచ్ఛగా ఆడమని ప్రోత్సహిస్తానని కూడా ఇషాన్ వెల్లడించాడు.








