సింగ‌ర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం

సింగ‌ర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం

ప్రముఖ గాయని కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్‌(Hyderabad)లోని నిజాంపేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. గత రెండు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో బద్దలు కొట్టుకుని మరీ ఇంట్లోకి వెళ్లి ఆమెని రక్షించారు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

కారణం ఏమిటి?
సింగ‌ర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె సూసైడ్‌కి కార‌ణం కుటుంబ సమస్యలా? వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒత్తిడా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు విచార‌ణ‌లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment