సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సికందర్’. 2025 ఈద్ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర టీజర్ నేడు లాంచ్ కావాల్సి ఉంది. అయితే, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూయడంతో, ఆయనకు గౌరవంగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ వాయిదా వేశారు.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్రబృందం విడుదల చేసింది. కొత్తగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, టీజర్ లాంచ్ ఈవెంట్ రేపు ఉదయం 11:07 గంటలకు జరగనుంది. అభిమానులు, ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.









అమరావతిలో పర్యావరణ విధ్వంసం.. జనసేన మాజీ నేత సంచలన వ్యాఖ్యలు