ఉన్న‌మాట అంటే అంత ఉలుకెందుకు మంత్రిగారూ..?

ఉన్న‌మాట అంటే అంత ఉలుకెందుకు మంత్రిగారూ..?

Summarize with AI

ప్రజల ప్రాణాలు కాపాడమని అడిగితే అంత అహంకారమా?. బాధ్యతలను గుర్తుచేస్తే ఇలాగే మాటల దాడులు చేస్తారా? అంటూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Satyakumar) వైఖరిపై సామాన్య జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ప్రజా సమస్యలపై మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (YS Jagan) మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని మండిపడుతున్నారు.

కూటమి పాలనలో(Coalition Rule) నిరుపేదలకు (Poor People) సంజీవని లాంటి ‘ఆరోగ్యశ్రీ’ పథకం (Aarogyasri Scheme) పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, బకాయిలు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయని, ఫలితంగా జనం పిట్టల్లా రాలిపోతున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీలైతే ప్రజల కోసం ఆ పథకాన్ని బతికించి, పేదలకు మంచి చేయాలంటూ ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా సూచించారు. ఐదేళ్ల పాటు ఆరోగ్యశ్రీని నిరాటంకంగా అమలు చేయడమే కాకుండా, ఉచిత వైద్య పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచిన మాజీ ముఖ్యమంత్రిగా పేదల ఆరోగ్యంపై (Poor People’s Health) ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ప్రజలకు మేలు చేసే ఈ ప్రతిపాదనలను సానుకూలంగా స్వీకరించి లోపాలను సరిదిద్దాల్సింది పోయి.. మంత్రి సత్యకుమార్ నోటికి పనిచెప్పడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. “ఆరోగ్యశ్రీ అనేది ప్రభుత్వ పథకం (Government Scheme).. మీ సొంత పథకం కాదు.. భారతీ సిమెంట్స్ నుంచో తీసుకొచ్చి పెట్టిన పథకం కాదు” అంటూ మంత్రి మాట్లాడిన తీరు నిరుపేదలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

వైద్య ఆరోగ్య శాఖలో రోజురోజుకూ చోటుచేసుకుంటున్న దారుణాలు, వైఫల్యాలపై దృష్టి పెట్టకుండా.. కేవలం ప్రతిపక్షాలపై నోరేసుకుని పడిపోవడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు మంత్రిపై వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ఏ స్థాయిలో దిగజారిందో తెలుసా అని ప్ర‌శ్నిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో తొల‌గించిన మ‌నిషి కాలును కాలును కుక్క కొరుక్కు తిన‌డం, ఆస్పత్రుల్లో మొబైల్ టార్చిలైట్ల వెలుగుల్లో రోగులకు వైద్యం, విశాఖలో కరెంట్ లేక, సమయానికి వైద్యం అందక పసిపిల్లాడు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు గుర్తుచేస్తున్నారు.

సొంత డబ్బా కొట్టుకోవడం, ప్రతిపక్షాలపై కక్షసాధింపు మాటలు మాట్లాడటం పక్కన పెట్టి.. ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంపై శ్రద్ధ పెట్టండి మంత్రిగారూ.. ఆరోగ్యశ్రీ (Aarogyasri) వైఎస్సార్ (YSR) తెచ్చిన ప‌థ‌కం.. అది పేదవాడి ప్రాణం కాపాడే పథకం. దాన్ని నిర్వీర్యం చేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడకండి అంటూ సామాన్యులు హితవు పలుకుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment