హిందూత్వంపై దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

హిందూత్వంపై దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

Summarize with AI

కాంగ్రెస్ జ్యేష్ఠ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ హిందూత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది, కాబట్టి ప్రజలు దానికి దూరంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు. హిందూత్వం వైపు వెళ్లే వారి మనస్సులలో, ఆలోచనలలో కేవలం ద్వేషమే నిండి ఉంటుందని వ్యాఖ్యానించారు. అసలైన సనాతన ధర్మానికి, హిందూత్వానికి చాలా తేడా ఉందన్న ఆయన, ప్రస్తుతం సనాతన ధర్మాన్ని హిందూత్వంగా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఈ వ్యత్యాసాన్ని సరిగ్గా వివరించకపోతే, వారు హిందూత్వం వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దిగ్విజయ్ సింగ్ ఉజ్జయిని నుంచి అయోధ్య వరకు సుమారు 1,000 కిలోమీటర్ల ‘సత్య సనాతన స్వాభిమాన్ యాత్ర’ చేపట్టారు. యాత్ర తొలి దశ పూర్తి చేసుకుని తన సొంత ఊరు రాఘవ్‌గఢ్ చేరుకోగా, కుమారుడు జైవర్ధన్ సింగ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం ప్రధాన సందేశం ‘వసుధైవ కుటుంబకం’ అని, ప్రపంచమంతా ఒకే కుటుంబమని వివరించారు. అయితే కొందరు సనాతనాన్ని ద్వేషంతో, హిందూత్వంతో ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

80 ఏళ్ల వయస్సులో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడానికి గల రెండు ప్రధాన కారణాలను ఆయన వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి బదులుగా నిరంకుశత్వం పెరుగుతోందని, రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ల దొంగతనం అంశాన్ని ప్రస్తావించారు. ఓట్ల అక్రమాలను అరికట్టేందుకు ఈవీఎంలను రద్దు చేసి, రాబోయే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

రెండో కారణంగా సనాతన ధర్మం పేరిట హిందూత్వాన్ని రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 1992లో అద్వాణీ చేపట్టిన రథయాత్రను మహాంత్ లాల్‌దాస్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. రామ మందిర నిర్మాణం కోసం సేకరించిన రూ.1,400 కోట్ల విరాళాల్లో కేవలం రూ.8.29 కోట్లకు మాత్రమే లెక్కలు చూపించారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment