స‌త్య‌బాబా స్ఫూర్తి అందరికీ ప్రేరణ – రాష్ట్ర‌ప‌తి

స‌త్య‌బాబా స్ఫూర్తి అందరికీ ప్రేరణ - రాష్ట్ర‌ప‌తి

పుట్టపర్తి (Puttaparthi) శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) శత జయంతి ఉత్సవాలు (Centenary Celebrations) శ‌నివారం సందడిగా జరిగాయి. రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu), సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మహాసమాధి వద్ద ప్రత్యేక దర్శనం అనంతరం ఉత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీ‌సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర‌ప‌తి పాల్గొని, బాబా సేవార్ధ సిద్దాంతాన్ని కొనియాడారు.

సత్యసాయి బాబా జీవితం సత్యం, శాంతి, ప్రేమ, ధర్మం, అహింస వంటి ఉన్నత విలువల ప్రతిరూపమని అన్నారు. “లోక కళ్యాణం కోసం బాబా చేసిన సేవలు అపారమైనవి. మానవ సేవే మాధవ సేవ అని బోధించిన బాబా, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 1969 నుంచే మహిళల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. దేశ–విదేశాల్లో సత్యసాయి భక్తులు నేటి వరకు పేదవారికి సేవలందిస్తున్నారు. బాబా స్పూర్తి అందరికీ ప్రేరణ” అని రాష్ట్రపతి అన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సత్యసాయి బాబా సిద్ధాంతాలను ప్రజలు ఆచరిస్తే సమాజం మరింత శ్రేయస్సు వైపు సాగుతుందని అన్నారు. “సత్యసాయి భక్తులు బాబా సిద్ధాంతానికి అంబాసిడర్లుగా మారాలి. బాబా చూపిన సేవామార్గం సమాజానికి వెలుగునిచ్చే దీపంలా కొనసాగాలి” అని పేర్కొన్నారు. శత జయంతి సందర్భం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని, బాబా ఆశీస్సులతో ప్రపంచం శాంతి–ప్రేమలతో నిండిపోవాలని సీఎం ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment