బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న సారా అర్జున్

బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న సారా అర్జున్

Summarize with AI

‘ధురంధర్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి సారా అర్జున్‌కు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకోవడంతో తన తదుపరి సినిమాల ఎంపిక విషయంలో ఆమె ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ నటి మధుబాల బయోపిక్‌లో సారా నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చినప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు రామ్ చరణ్ తదుపరి చిత్రం ఆర్సీ17లోనూ ఆమెకు అవకాశం దక్కవచ్చని, ఇందుకోసం ఆడిషన్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా, ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించనున్న కొత్త మ్యూజికల్ లవ్‌స్టోరీలో సారా అర్జున్ కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘సైయారా’ విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ నిర్మించనున్న చిత్రంలో అంబరీష్ వర్మ హీరోగా నటించనున్నట్లు సమాచారం. మనీష్ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల టాక్. అయితే సారా ఎంపికపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment