ట్రోల్స్‌పై సాయి పల్లవి ఘాటైన స్పందన

ట్రోల్స్‌పై సాయి పల్లవి ఘాటైన స్పందన

Summarize with AI

టాలెంట్, అందం, అభినయం.. ఈ మూడింటి కలయిక సాయి పల్లవి (Sai Pallavi). తెలుగు, తమిళ, భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సరసన ‘రామయణ’ (Ramayana) చిత్రంలో సీతగా నటిస్తోంది. అయితే కెరీర్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా , కొన్ని వివాదాలు మాత్రం ఆమెను వెంటాడుతునే ఉన్నాయి. ముఖ్యంగా తాను మలయాళీని (Malayali) కాదన్న విషయంపై గతంలో జరిగిన రచ్చపై తాజాగా సాయి పల్లవి స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు నాలుగేళ్ల క్రితం ఒక ప్రెస్ మీట్‌లో ‘మీరు మలయాళీలు అయి ఉండి తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు?’ అని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నేను తమిళ అమ్మాయిని (Tamil Girl), మలయాళీని కాదు’ అని సాయి పల్లవి బదులిచ్చారు. కానీ, రెండు సంవత్సరాల తర్వాత అదే మాటను కొందరు వక్రీకరించి ‘మలయాళీ అని పిలిచినందుకు సాయి పల్లవికి కోపం వచ్చింది’ అంటూ తప్పుడు ప్రచారం చేశారట..

అయితే ఈ హెడ్‌లైన్ చూసి తాను.. ‘షాక్‌కు గురయ్యా, అసలు నేను అనని మాటలను నాపై మోపడం బాధాకరం. తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టి పెరిగిన నేను, నా మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పా, అంతే తప్ప ఇతర భాషలను తక్కువ చేసే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు’ అని ఆమె స్పష్టం చేశారు. సాయి పల్లవి ఇచ్చిన ఈ వివరణతో గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ చిన్నపాటి వివాదానికి ఇప్పుడు పూర్తి స్థాయిలో తెరపడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment