స్కూట‌ర్ బాంబు బ్లాస్ట్‌.. రష్యా న్యూక్లియర్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ హెడ్ మృతి

స్కూట‌ర్ బాంబు బ్లాస్ట్‌.. రష్యా న్యూక్లియర్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ హెడ్ మృతి

Summarize with AI

ర‌ష్యా న్యూక్లియర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ హెడ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇగోర్‌ కిరిల్లోవ్‌ బాంబు పేలుడులో దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం మాస్కోలోని రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌ సమీపంలో జరిగింది. స్కూటర్‌లో అమర్చిన బాంబు పేలడంతో ఆయనతో పాటు సహాయకుడు కూడా మరణించినట్లు రష్యా దర్యాప్తు కమిటీ వెల్లడించింది.

దర్యాప్తు ప్రారంభం
పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకున్న దర్యాప్తు బృందాలు, ఫోరెన్సిక్‌ నిపుణులు కేసు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను రష్యా దర్యాప్తు కమిటీ ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో వెల్లడించారు. 300 గ్రాముల పేలుడు పదార్థాలను ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అమర్చారని.. దాన్ని రిమోట్‌తో ఆపరేట్ చేశారని రష్యా పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఉక్రెయిన్‌పై చర్యల తర్వాత వాదనల ఉత్కంఠ
2022వ సంవత్సరం ఫిబ్రవరిలో రష్యా.. ఉక్రెయిన్‌పై చేసిన సైనిక ఆపరేషన్‌లో ఆయన నిషేధిత రసాయనాలను ఉపయోగించినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ డిసెంబర్ 16న ఆరోపణలు చేసింది. 4,800 కంటే ఎక్కువ రసాయన ఆయుధాలను ఉపయోగించినట్లు పేర్కొంది. ముఖ్యంగా K-1 పోరాట గ్రెనేడ్‌లను వాడినట్లు స్పష్టం చేసింది. అయితే తమ దేశంలో ఆ ఆయుధాలను నిషేధించినట్లు కూడా వివరించింది. ఈ మరణం నేపథ్యంలో ఆ ఆరోపణలపై కొత్త చర్చలు మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment