వైసీపీలోకి రేప‌ల్లె కీల‌క నేత‌.. జగన్ సంచ‌ల‌న‌ హామీ

వైసీపీలోకి రేప‌ల్లె కీల‌క నేత‌.. జగన్ సంచ‌ల‌న‌ హామీ

రేపల్లె నియోజకవర్గ (Repalle Constituency) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత, నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కంగా ఉన్న‌ మోపిదేవి శ్రీనివాసరావు (Mopidevi Srinivasa Rao) తన అనుచరులతో కలిసి వైసీపీలో(YSRCP) చేరారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) … మోపిదేవికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

శ్రీనుకి అండగా ఉంటా.. జగన్ భరోసా
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మోపిదేవి శ్రీనివాసరావును వైసీపీ కుటుంబ సభ్యుడిగా అభివర్ణించారు. “శ్రీను నాపై నమ్మకంతో పార్టీలోకి వచ్చారు. ఆయనకు అన్ని రకాలుగా న్యాయం చేసే బాధ్యత నాది. మోపిదేవి చేసే మంచిని నేను ఎన్నటికీ మరువను. సరైన సమయంలో ఆయనను చట్ట సభల్లో కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను” అని జగన్ హామీ ఇచ్చారు.

నియోజకవర్గ రాజకీయాలపై స్పందిస్తూ.. రేపల్లె ఇన్ఛార్జి మోహన్ కృష్ణకు (Mohan Krishna) అందరూ మద్దతుగా నిలవాలని జగన్ కోరారు. “మోపిదేవి శ్రీనివాసరావు మోహన్ కృష్ణ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకోవాలి. మీ అందరి సహకారంతో రేపల్లెలో వైసీపీ జెండా ఎగురవేయాలి” అని పిలుపునిచ్చారు. త్వరలోనే మరికొంతమంది కార్యకర్తలను పరిచయం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment