కార్యకర్తలకు జగన్ గిఫ్ట్.. ‘జగన్ 2.O సూపర్ యాప్’ లాంచ్

కార్యకర్తలకు జగన్ బిగ్ గిఫ్ట్.. 'జగన్ 2.O సూపర్ యాప్' లాంచ్

Summarize with AI

సోషల్ మీడియా వేదికగా త‌న పార్టీ యాక్టివిస్టులు, సానుభూతిప‌రుల‌పై జరుగుతున్న డిజిటల్ దాడులు, కుట్రలను తిప్పికొట్టేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జగన్ 2.ఓ సూపర్ యాప్’ (Jagan 2.O Super App)ను ఆయన అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తల గొంతు నొక్కేందుకు జరుగుతున్న కుట్రలను చెక్ పెట్టడానికే ఈ విప్లవాత్మక ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఈ యాప్ ఆవిష్కరణ సందర్భంగా జగన్ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు.

సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు పోస్ట్ చేసిన కంటెంట్‌ను తొల‌గించేందుకు కుట్ర‌లు చేస్తున్నార‌ని జ‌గ‌న్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పార్టీ త‌ర‌ఫున ఒక సొంత యాప్ తీసుకొచ్చి సరికొత్త ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశామ‌ని చెప్పారు. ఇందులో వేసే కంటెంట్‌ను ఎవరు పడితే వారు డిలీట్ చేసే హక్కు ఉండదని, ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయాన్ని పంచుకోవచ్చని జ‌గ‌న్ చెప్పారు

గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు కనెక్టివిటీ
“ఈ యాప్ ద్వారా పార్టీలో ఉన్న గ్రామ‌స్థాయి కార్యకర్త మొదలుకుని, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు కేంద్ర కార్యాలయం వరకు అందరూ ఒకే తాటిపైకి వస్తారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులపై నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్‌లో ఉండే గోల్డెన్ ఛాన్స్ ఈ యాప్ కల్పిస్తుంది” అని చెప్పారు.

డిజిటల్ డైరీతో అనుసంధానం..
రాజకీయ, పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న వైసీపీ క్యాడర్ కోసం ఇప్పటికే డిజిటల్ డైరీలో వివరాలు నమోదు చేస్తున్నామ‌ని జ‌గ‌న్ వివ‌రించారు. ఆ డైరీని కూడా ఈ సూపర్ యాప్‌తో అనుసంధానం చేశామ‌ని, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా యాప్ ద్వారా డిజిటల్ డైరీలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఎక్కడ ఏ కార్యకర్త ఇబ్బంది పడినా యాప్‌లో పోస్ట్ చేస్తే.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యావత్ పార్టీ యంత్రాంగం అతనికి అండగా నిలబడుతుందని చెప్పారు.

ప్రెస్ మీట్లు, కార్యక్రమాలు అన్నీ లైవ్ ఫీడ్
వైసీపీ నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్ మీట్లు, ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలు, పార్టీ ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్‌లో లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకు క్షణాల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైసీపీపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై లీగల్‌గా ఫిర్యాదు చేసి, వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే.. మరోవైపు మనకంటూ ఎవరూ ఆపలేని విధంగా ఈ సూపర్ యాప్‌ను సొంతంగా రూపొందించుకున్నామ‌ని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment