రాయచోటిలో అరాచకం… వైసీపీ కార్యాలయానికి నిప్పు

చంద్రబాబు ప్రభుత్వానికి భారీ షాక్.. సాయికృష్ణ కేసు సీబీఐకి అప్ప‌గింత‌

Summarize with AI

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నామినేష‌న్ ప్రక్రియ మొద‌లైన రోజే అధికార పార్టీ వీరంగం ప్ర‌ద‌ర్శించింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. రాయచోటిలో వైసీపీ ఆఫీస్ ను టీడీపీ మూకలు నిప్పింటించారు. అంతేకాకుండా కార్యాలయంపై టీడీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్న వాహనాలకు టీడీపీ నిప్పు పెట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

రాయచోటిలోని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో సుమారు 10 వాహనాలకు నిప్పు పెట్టారు. ఆపై వైసీపీ కార్యాలయంకు నిప్పు పెట్టారు. మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

దాడి జరిగిన సమయంలో శ్రీకాంత్ రెడ్డి కార్యాలయంలోనే ఉన్నారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామాలతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దాడి నేపథ్యంలో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా తెలుగుదేశం నాయుకులు దాడి చేశారు. దాడి అంతా వైసీపీ అభ్యర్థులు భయపెట్టి నామినేషన్లు జరగకూడదనే ఆలోచనలతో జరగుతుందని వైసీపీ తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment