రష్మిక ప్రేమాయ‌ణంపై నిర్మాత‌ నాగవంశీ కీల‌క వ్యాఖ్య‌లు

రష్మిక ప్రేమాయ‌ణంపై నిర్మాత‌ నాగవంశీ కీల‌క వ్యాఖ్య‌లు

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ వ్యవహారం ఒక హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా నెట్టింట వీరిద్దరి ప్రేమపై చర్చలు జరుగుతున్నాయి. కాగా, రష్మిక, విజయ్ దీనిపై ఎటువంటి అధికారిక‌ ప్రకటనలు చేయలేదు. విజయ్ “సమయం వచ్చినప్పుడు ప్రేమ, పెళ్లి విషయాలు బయటపెడతాను” అని చెప్పినా, రష్మిక “ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు” అని పేర్కొంది.

అయితే, వీరిద్దరు కలిసి వెకేషన్లకు వెళ్లినప్పటికీ, ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉండగా, అసలు విషయం బయటపడలేదు. తాజాగా యువ నిర్మాత నాగవంశీ ఈ ప్రేమ కథపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రష్మిక ప్రస్తుతలో ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని, అతన్నే పెళ్లి చేసుకుంటుందని ప్రకటించారు.

“అతను ఎవరో మనకు తెలుసు” అని నాగవంశీ వ్యాఖ్యానించారు. ‘అన్‌స్టాపబుల్’ టాక్‌ షోలో ఈ వ్యాఖ్యలు చేసిన నాగవంశీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు “రష్మిక ప్రేమలో ఉన్నది విజయ్ దేవరకొండతోనే”, “ఈ ఏడాదిలో వారి పెళ్లి జరగాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment