ఏపీలో మ‌రో దారుణం.. పదేళ్ల బాలికపై లైంగిక దాడి!

ఏపీలో మ‌రో దారుణం.. పదేళ్ల బాలికపై పైశాచిక దాడి

Summarize with AI

తిరుపతి (Tirupati) జిల్లా రైల్వే కోడూరు మండలంలో(Railway Kodur) అత్యంత హేయమైన ఘ‌ట‌న‌ వెలుగు చూసింది. అమాయకమైన పదేళ్ల మైనర్ బాలికపై(Minor Girl) ఒక వ్యక్తి విచక్షణారహితంగా లైంగిక దాడికి(Sexual Assault) పాల్పడటమే కాకుండా, పైశాచికంగా వ్యవహరించిన ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. నిందితుడు అధికార తెలుగుదేశం పార్టీకి (TDP)చెందిన వ్యక్తిగా సమాచారం.

ఘటన వివరాలు.. రైల్వే కోడూరు మండలం అబ్బినాయుడుపల్లెకు చెందిన పదేళ్ల మైనర్ బాలిక గ్రామంలో ఐదో తరగతి చదువుతోంది. సోమవారం రోజున బాలిక తన ఇంటి బయట కూర్చుని ఉండగా, అదే ప్రాంతానికి చెందిన చీరల రమేష్ నాయుడు (Chirala Ramesh Naidu) (45) అనే వ్యక్తి ఆటోలో అక్కడకు వచ్చాడు.

బాలికను ఆటోలో రైల్వే స్టేషన్ ప్రాంతానికి, ఆ తర్వాత ఊరి బయట ఉన్న నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై విచక్షణారహితంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా పైశాచికంగా వ్యవహరించాడు.

ఘటన జరిగిన సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు, మరుసటి రోజున ధైర్యం చేసి తల్లికి తనకు జరిగిన దారుణాన్ని వివరించింది. విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ వెంటనే రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్‌ను(Railway Kodur Police Station) ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ దారుణానికి సంబంధించిన వివరాలను, దర్యాప్తు పురోగతిని పోలీసులు మీడియాకు పొక్కకుండా గోప్యంగా ఉంచడంపై స్థానికంగా పలు అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కామాంధుడైన నిందితుడు చీరల రమేష్ నాయుడిని తక్షణమే అరెస్ట్ చేసి, పోక్సో (POCSO) చట్టం కింద కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి తక్షణ న్యాయం అందించాలని ప్రజా సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment