ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పెట్టుబడులను (Investments) ప్రోత్సహించడంతో పాటు ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను వాస్తవ పెట్టుబడులుగా మార్చి, ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. అమరావతిలో(Amaravati) సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పరిశ్రమలు(Industries), ఇంధనం(Energy), పర్యాటకం(Tourism), ఐటీ(IT) సహా పలు రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించారు.
ఎలక్ట్రానిక్స్(Electronics), ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లో పెట్టుబడులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. గతంలో చేసుకున్న ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాకుండా, ప్రాజెక్టుల నిర్మాణం (Project Construction పూర్తై ఉత్పత్తి ప్రారంభమయ్యేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టుల కార్యాచరణ ప్రారంభమైనట్లు అధికారులు సమావేశంలో వివరించారు.
పెట్టుబడుల సదస్సు నిర్వహణ కోసం విశాఖపట్నంలో(Visakhapatnam) కన్వెన్షన్ సెంటర్ (Convention Centre) ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
రాయలసీమను(Rayalaseema) గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా(Global Horticulture Hub) అభివృద్ధి చేయడంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కీలక పాత్ర పోషించాలని సీఎం పేర్కొన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, తూర్పు-పశ్చిమ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుతో వాటికి అనుబంధంగా అవసరమైన పరిశ్రమలు, సేవలు అభివృద్ధి చెందేలా సమగ్ర ఎకోసిస్టమ్‌ను నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.








