రాహుల్ గాంధీకి నెల‌కు రూ.200 కోట్ల ముడుపులు

రాహుల్ గాంధీకి నెల‌కు రూ.200 కోట్ల ముడుపులు

Summarize with AI

తెలంగాణలో(Telangana) 22A భూముల వ్యవహారంపై (22A Lands Issue) బీజేపీ(BJP) లెజిస్లేచర్ పార్టీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి(Aleti Maheshwar Reddy)మరోసారి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 22A పేరుతో జరుగుతున్న భూ అక్రమాలపై స్పందించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ వ్యవహారంపై బీజేపీ నెల రోజులుగా పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.

22A పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూదందాపై (Land Scam) రాహుల్ గాంధీ స్పందించాలని మహేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అక్రమంగా ముడుపులు (Illegal Bribes) వసూలు అవుతున్నాయని ఆరోపిస్తూ.. నెలకు రూ.200 కోట్ల మేర ముడుపులు రాహుల్ గాంధీకి అందుతున్నాయని తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఇవి తన ఆరోపణలని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.

నిషేధిత జాబితా(Prohibited List) (22A)లో చేర్చిన భూముల పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని మహేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్లయితే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో(Sitting Judge) విచారణ జరిపిస్తారా? సీబీఐ దర్యాప్తునకు(CBI Investigation) ఆదేశిస్తారా? లేక అసెంబ్లీ హౌస్ కమిటీAssembly House Committee) ఏర్పాటు చేస్తారా? అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో ఆధారాలతో 22A అంశంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ.. సంబంధిత మంత్రి చర్చకు రాకుండా వెళ్లిపోయారని మహేశ్వర రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తీసుకొచ్చిన భూ భారతి (Bhu Bharati) వ్యవస్థపై కూడా మహేశ్వర రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ 33 నెలల పాలనలో భూ భారతి అతిపెద్ద కుంభకోణంగా మారిందని ఆరోపించారు. భూ భారతి మంత్రులకు నగలు, వజ్రాల హారంగా మారిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెబుతున్న అసలు కుట్ర ఆయన కేబినెట్‌లోనే జరుగుతోందని ఆరోపించారు. 22A భూముల వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయడంతో పాటు అక్రమాలకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 22A అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని మహేశ్వర రెడ్డి కోరారు.

ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) రాజీనామా(Resignation) చేయాలని మహేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. 22A భూముల అంశంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment