టాలీవుడ్ యువ డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్

టాలీవుడ్ యువ డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్

Summarize with AI

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన యువ దర్శకుడు పవన్ సాధినేనిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు.

పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను మోసం చేశాడంటూ ఓ నటి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పవన్ సాధినేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పవన్ సాధినేని రిమాండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

పవన్ సాధినేని తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’, ‘సేనాపతి’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘ఆకాశంలో ఒక తార’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో పవన్ సాధినేని అరెస్ట్ వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

అయితే నటి చేసిన ఆరోపణలపై పూర్తి వివరాలు, కేసు దర్యాప్తు పురోగతి, తదుపరి న్యాయపరమైన చర్యలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment