పూరి జగన్నాథ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మల్టీస్టారర్

పూరి జగన్నాథ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మల్టీస్టారర్

Summarize with AI

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరైన పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఒకప్పుడు టాప్ హీరోలతో వరుస హిట్ సినిమాలు అందించేవారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ వంటి ప్రముఖుల కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన పలు చిత్రాలు పూరి దర్శకత్వంలోనే వచ్చాయి. కానీ, ఇటీవల “లైగర్” మరియు “డబుల్ ఇస్మార్ట్” వంటి చిత్రాలతో కాస్త వేగం త‌గ్గింది.

ఇప్పటి పరిస్థితుల్లో తన మార్కెట్ మళ్లీ స్థిరపడేలా పూరి కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది మల్టీస్టారర్ (Multi-starrer)సినిమా అని, ఇందులో తన కొడుకు ఆకాష్ జగన్నాథ్ (Akash Jagannadh) ప్రధాన పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

ఆకాష్‌తో పాటు మరో యంగ్ హీరో
ఆకాష్ ఇప్పటికే టాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసినప్పటికీ పెద్ద హిట్ దక్కించుకోలేదు. ఈసారి ఆకాష్‌కి పెద్ద బ్రేక్ ఇవ్వాలని పూరి కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆకాష్‌తో పాటు మరో యంగ్ హీరో ఉండబోతున్నట్లు టాక్. పూరి గతంలో టాప్ స్టార్లకు హిట్ చిత్రాలను అందించిన విధంగా, ఈసారి కూడా ఆకాష్‌ను స్టార్‌గా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. టాలీవుడ్‌లో ఇది ఎలా రూపుదిద్దుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment