గ‌న్న‌వ‌రంలో రాష్ట్ర‌ప‌తికి ఘ‌న‌స్వాగ‌తం

గ‌న్న‌వ‌రంలో రాష్ట్ర‌ప‌తికి ఘ‌న‌స్వాగ‌తం

Summarize with AI

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఘన స్వాగతం పలికారు.

విమానాశ్రయంలో పోలీసు గౌరవవందనాన్ని స్వీకరించిన అనంతరం రాష్ట్రపతి మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ(ఎయిమ్స్‌) స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి బయలుదేరారు. స్నాత‌కోత్స‌వంలో పాల్గొని ప్ర‌సంగించిన అనంత‌రం ఎంబీబీఎస్ విద్యార్థుల‌కు మెడ‌ల్స్ ప్ర‌దానం చేయ‌నున్నారు. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము తెలంగాణ‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment