సెంట్ర‌ల్ వ‌ర్సెస్ స్టేట్‌.. మంత్రుల బ‌హిరంగా స‌వాళ్లు

కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్!

Summarize with AI

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల (By Elections) ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్  (Ponnam Prabhakar) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)కి భారీ సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో బీజేపీ (BJP)కి వచ్చిన 25 వేల ఓట్ల కంటే ఒక్క ఓటు కూడా తగ్గకుండా ఈసారి తెచ్చి చూపిస్తే, కిషన్ రెడ్డి ఏం చెప్పినా తాను సిద్ధమని పొన్నం ప్రకటించారు. లేదంటే, తాను చెప్పేందుకు కిషన్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి పది వేల లోపే ఓట్లు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి యువకుడు, స్థానికుడు కావడంతో పాటు, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌(Congress)ను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు. “అభివృద్ధి అంటే పెన్షన్ల లెక్క చెప్పడం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్. మేము రెండు నెలల్లోనే ₹2500 కోట్ల పనులు చేశాము” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకరించినందుకు గురుదక్షిణగా బీజేపీ అభ్యర్థిని బీఆర్ఎస్‌కు తాకట్టు పెట్టారు అని కిషన్ రెడ్డిపై పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఆరోపించారు. ప్రజల మద్దతు చూస్తుంటే, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment