పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. న‌గ‌లు, న‌గ‌దు మాయం

పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. న‌గ‌లు, న‌గ‌దు మాయం

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఫిలింనగర్‌లోని ఆయన ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు విలువైన ఆభరణాలను దొంగ‌లు త‌స్క‌రించారు. దీంతో పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణా దేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

ఇంట్లో ఎవరూ లేని స‌మ‌యంలో..
ఈ దొంగతనం జరిగిన సమయంలో, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఆయన కుటుంబసభ్యులు ఇంట్లో లేరు. ఆ రోజు పొన్నాల జనగాం జిల్లాలో ఉన్నట్లు సమాచారం. పొన్నాల లక్ష్మయ్య చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించిన ఆయన, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే, ఆయన ఎక్కడినుంచి పోటీ చేయలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment