డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం (Pithapuram) నియోజకవర్గ కూటమి రాజకీయాల్లో ఫ్లెక్సీ (Flexi Banner) రగడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పీఏడీఏ (PADA) కార్యాలయంలో నిర్వహించిన పీఎం ఆవాస్ యోజన (PMAY) కార్యక్రమంలో టీడీపీ (TDP), జనసేన (Jana Sena Party) నాయకుల మధ్య బహిరంగంగానే వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మపైకి (NVSN Varma) జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు (Pendem Dorababu) దాడికి దూసుకెళ్లడం సంచలనంగా మారింది.
అసలు ఏం జరిగింది?
పిఠాపురం పీఏడీఏ (PADA) కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఫోటో లేకపోవడాన్ని ఎన్వీఎస్ఎన్ వర్మ (NVSN Varma) తీవ్రంగా ఆక్షేపించారు. ప్రొటోకాల్ ప్రకారం సీఎం ఫోటో ఉండాల్సిందేనని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు (Tummalababu), వర్మ (Varma) మధ్య మాటా మాటా పెరిగింది.
ఈ వివాదంలోకి ప్రవేశించిన జనసేన నేత పెండెం దొరబాబు.. “పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు” అంటూ వర్మపైకి ఒక్కసారిగా దూసుకెళ్లారు. దాడి చేసేందుకు యత్నించగా, తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ-జనసేన కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకోవడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. సహచరులు అడ్డుకోవడంతో వర్మపై దాడి తప్పింది.
పిఠాపురంలో కూటమి నేతల ఫ్లెక్సీ రగడ
— Telugu Feed (@Telugufeedsite) April 21, 2026
పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు
మాజీ ఎమ్మెల్యే లు ఎస్వీఎస్ఎన్ వర్మ..పెండెం దొరబాబు మధ్య రగడ.
టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. ఒకరినొకరు నెట్టుకున్న నాయకులు
పాడ కార్యాలయంలో జరిగిన pmajay కార్యక్రమంలో… pic.twitter.com/hMiRdV9LVl
మేము దత్తతకు రాలేదు.. – వర్మ ఆవేదన
ఈ ఘటన అనంతరం ఎన్వీఎస్ఎన్ వర్మ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. “మేం పిఠాపురంలోనే పుట్టి పెరిగాం. వీళ్లలాగా ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు. పిఠాపురంలో టీడీపీ బలంగా ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్‌కు 80 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. అది మర్చిపోకూడదు. నియోజకవర్గంలో జనసేన నేతల తీరు టూ మచ్‌గా ఉంది. రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తాం” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేం పిఠాపురంలో పుట్టి పెరిగాం.. ఎక్కడ నుంచో దత్తతకు రాలేదు వీళ్లకు లాగా..
— Telugu Feed (@Telugufeedsite) April 21, 2026
టీడీపీ బలంగా ఉంది కాబట్టే పవన్‌కు 80 వేల మెజార్టీ ఇచ్చాం.. రేపటి నుంచి చూపిస్తాం
టూ మచ్‌గా ఉంది పిఠాపురం నియోజవకర్గంలో
– ఎస్వీఎస్ఎన్ వర్మ ఆవేదన https://t.co/c27NmBId0d pic.twitter.com/RKKtt5tzy6
గత కొంతకాలంగా పిఠాపురంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా ఘటనతో ఈ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దొరబాబు మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం కూటమి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.








