ఎన్నికల హామీలను (Election Promises) నమ్మి ఓట్లేసిన మహిళలు (Women), రైతులు(Farmers), నిరుద్యోగుల (Unemployed Youth) తరహాలోనే రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థను (Police System) కూడా చంద్రబాబు (Chandrababu Naidu) ఘోరంగా మోసం చేశారని వైసీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) మండిపడ్డారు. అదేవిధంగా, ఏపీ(AP) ప్రజల ఆస్తి అయిన మచిలీపట్నం (బందరు) పోర్టును తెలంగాణకు (Telangana) విక్రయించేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఒప్పందాలు చేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
తాడేపల్లిలో జరిగిన ప్రెస్ మీట్‌లో పేర్ని నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ (Law and Order) కాపాడే పోలీస్ కానిస్టేబుళ్ల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్ని నాని విమర్శించారు. పోలీసులకు రావాల్సిన అలవెన్సులు, బకాయిలను ప్రభుత్వం ఎగ్గొడుతోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు (Constables) ఇవాల్టికీ 6 సరెండర్ లీవులు (Surrender Leaves) బకాయి పెట్టారు. సరెండర్ లీవ్ లను కూడా ‘వన్ బై టు టీ’ (Surrender Leaves) తరహాలో సగానికి తగ్గించిన ఘనత చంద్రబాబుదే. పోలీసులకు టీఏ (TA) కింద ఏకంగా రూ. 72 వేలు బాకీ పడ్డారు. ఏపీఎస్పీ, ఏఆర్ రిజర్వు కానిస్టేబుళ్లకు (AR Reserve Constables) ఏడాదికి రూ. 36 వేల చొప్పున రాకుండా ప్రభుత్వం ఎగ్గొట్టింది. పోలీసులను చంద్రబాబు బ్రాందీ షాపుల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు కనీసం 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.
“పెళ్లి రోజు, భార్య పుట్టినరోజుకు సెలవులు ఇస్తామని.. పోలీసులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్'(Work From Home) ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది బాబూ? నేను కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇప్పుడు పోలీసుల కష్టాలపై ఎందుకు నోరు మెదపడం లేదు? హోంమంత్రి వంగలపూడి అనితకు పోలీసుల సంక్షేమం గురించి అస్సలు పట్టింపే లేదు.” అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నాటి ‘ఆర్డర్లీ’ వ్యవస్థ (Orderly System) పేరుతో రిటైర్ అయిపోయిన ఐపీఎస్ అధికారుల ఇళ్లల్లో కూడా కానిస్టేబుళ్లతో బానిస వెట్టిచాకిరి చేయిస్తున్నారని, ఈ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మచిలీపట్నం పోర్టు వ్యవహారంపై చంద్రబాబుపై పేర్ని నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. “బందరు పోర్టును తెలంగాణకు అమ్మడానికి చంద్రబాబు నాయుడు ఎవరు? అది ఖర్జూరపు నాయుడు సొంత ఆస్తి కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి. చీకట్లో తెలంగాణ సీఎం (Telangana CM) రేవంత్ రెడ్డితో (Revanth Reddy) బందరు పోర్ట్ అమ్మకంపై చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారు.” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.








