పరిటాల రవి హత్య కేసు.. 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్

పరిటాల రవి హత్య కేసు.. 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్

Summarize with AI

పరిటాల రవి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత హైకోర్టు ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో A-3 నారాయణరెడ్డి, A-4 రేఖమయ్య, A-5 రంగనాయకులు, A-6 వడ్డే కొండ, A-8 ఓబిరెడ్డి ఉన్నారు. వీరు 18 ఏళ్లు జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు. ఎట్ట‌కేల‌కు వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. నిందితులు ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకల్లా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది.

2005లో సంచలనం సృష్టించిన కేసు
2005 జనవరి 24న అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన పరిటాల రవీంద్ర హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి కేసు నడుస్తుండగా, ఇప్పుడు హైకోర్టు నిందితులకు బెయిల్ ఇచ్చి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment