‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న యష్(Yash) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’(Toxic). గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లో శృంగారభరిత సన్నివేశాలు చర్చనీయాంశం కాగా, ‘తబాహి’ పాటలో యష్-కియారా కెమిస్ట్రీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా విడుదలైన ‘మనసాగదే’(Manasaagade) పాట కూడా అదే తరహాలో గ్లామరస్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో యష్, తారా సుతారియా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా బాత్‌టబ్‌లో గన్‌తో ప్రపోజ్ చేసే సీన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ను చూస్తుంటే యాక్షన్ కంటే రొమాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం సినిమాపై భారీ అంచనాలు లేకపోయినా, త్వరలో విడుదల కానున్న ట్రైలర్‌తో హైప్ పెరుగుతుందేమోనని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.








